భూమి తయారీ : భూమిలో సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరంల స్థాయిపూర్తిగా అడుగంటిందని ఇటీవల రూపొందించిన ఇక్రిశాట్ భూసార పటాలు (Soilmaps) వెల్లడించాయి. ఈ పరిస్థితులలో రైతులు ఆశించిన దిగుబడులను పొందాలంటే నేలలో సేంద్రియ కర్బనశాతం పెంచడం, క్షేత్రంలో సూక్ష్మజీవులసంపదను పునరుద్దరించడం దిశగా చర్యలు చేపట్టాలి. పొలంలో సేంద్రియ కర్బన
శాతం పెరగాలంటే వరినాట్లకు ముందు పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి పొలంలోకలియదున్నాలి. సంప్రదాయకంగా సాగు చేసే జనుము,జీలుగ, అపరాల వలనపాక్షిక ఫలితం మాత్రమే కలుగుతుంది.మహారాష్ట్రకు చెందిన శ్రీపాద దభోల్కర్ఫలితాలనిస్తుంది.రూపొందించిన బహుళ విత్తనపచ్చిరొట్ట సాగు పద్ధతి దేశవ్యాప్తంగా అత్యుత్తమ
విత్తన ఎంపిక : దేశీవంగడాల విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. అవి లభించకపోతే సూటి రకాలను ఎంపిక చేసుకోవాలి. బెరుకులు ఉంటే ఏరి వేసుకోవాలి.ఒక డ్రమ్ములో నీరు పోసుకుని అందులో ఒక కోడిగ్రుడ్డు వేయాలి.అది పూర్తిగా అడుగుకు మునిగిపోతుంది. తర్వాత ఆ నీటిలో క్రమంగా ఉప్పు లేదా ఉప్పునీరు కలుపుతూ పోవాలి. నీటి సాంద్రత పెరిగి గుడ్డు నీటి పైకి తేలుతుంది.గుడ్డు తీసి ప్రక్కన పెట్టి ఆ నీటిలో వరివిత్తనాలు వేయాలి. మంచివిత్తనం అడుగున చేరి తాలుగింజలు పైకి తేలుతాయి. తాలును ఏరివేసిన తర్వాత నీరు ఒంపేసి వడ్లను తీసి మంచి నీటితో కడగాలి. 
విత్తన మోతాదు : సాగు చేసే రకాన్ని బట్టి విత్తన మోతాదు మారుతుంది. నీటి వసతి గల ప్రాంతాలలో ఎకరం నేలలో విత్తడానికి వివిధ పంటకాలాలున్న రకాల్లో విత్తన మోతాదు.
తక్కువ కాలపరిమితి గల రకాలు 24-35 కి.
మధ్యకాలిక రకాలు 16-24 కి,
దీర్ఘకాలిక రకాలు 12-24 కి.
మెట్ట ప్రాంతాలలో వర్షాధార సాగు రకాలు :3 4-40 కి.
విత్తనశుద్ధి విత్తనశుద్ది మొలకశక్తిని, దృఢంగా పెరగడానికి,
పురుగులు, తెగుళ్ళకు నిరోధకశక్తిని పెంచుతుంది. విత్తనశుద్ధిలో
అనేక పద్ధతులున్నాయి.
విత్తనాలను నీటిలో నానబెట్టడం విత్తనాలను చిన్నగోనె సంచిలో
గాని లేదా గుడ్డ సంచిలో గాని కట్టి నీటిలో 12 గంటలు నానబెట్టాలి,
తర్వాత సంచిని నీటి నుండి తొలగించి తడిగోనె సంచితో కప్పాలి.
మరుసటి రోజు విత్తనాలను మరల 8 గంటలు నానబెట్టాలి. తర్వాత
విత్తనాలను నీటి నుండి తొలగించి నారుమడిలో విత్తాలి. ఈ పద్ధతి
విత్తనాల మొలక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఆవుపేడ ద్రావణాన్ని ఉపయోగించడం వరి విత్తనాలను ఆవుపేడ
ద్రావణంలో శుద్ధి చేయడం వలన మొలకశాతం పెరుగుతుంది. అరకిలో
తాజా ఆవు పేడను, 2 లీ. ఆవుమూత్రాన్ని తీసుకుని 5 లీ. నీటిలో
కలపాలి. 10-15 కి. విత్తనాన్ని ముందుగా నీటిలో 10-12 గంటలు
నానబెట్టి తర్వాత 5-6 గంటలు ఆవు పేడ ద్రావణంలో నానబెట్టాలి.
ఈ విత్తనాలను నీడలో ఆరబెట్టి నారుమడిలో విత్తాలి.
మేక పేడ ద్రావణాన్ని ఉపయోగించడం విత్తనాలను ఒక రోజు
మేక పేడ ద్రావణంలో నానబెడితే మొలక శాతం పెరుగుతుంది.
ఆవుమూత్రం ద్రావణాన్ని ఉపయోగించడం 500 మి.లీ. ఆవు
మూత్రాన్ని 2.5 లీ. నీటిలో కలపాలి. విత్తనాలను చిన్న సంచులలో
కట్టి అరగంట సమయం ఆవుమూత్రం ద్రావణంలో నానబెట్టాలి. విత్తే
ముందు విత్తనాలను నీడలో ఆరబెట్టాలి.
వస (స్వీట్ ఫ్లాగ్) ద్రావణాన్ని ఉపయోగించడం 1.25 కి. వస
దుంపల పొడిని 6 లీ. నీటిలో కరిగించాలి. విత్తనాలను చిన్న సంచులలో
కట్టి ఈ ద్రావణంలో అరగంట నానబెట్టాలి. విత్తే ముందు విత్తనాలను నీడలో
ఆరబెట్టాలి (ఒక హెక్టారు పొలంలో విత్తడానికి అవసరమయ్యే విత్తనాలను
శుద్ధి చేయడానికి ఈ పరిమాణం పొడి అవసరం)
గున్నంగి (సాల్వడోరా పెర్సికా) నుపయోగించడం: సాల్వడోరా పెర్సికా
ఆకులను దగ్గరగా అల్లిన వెదురుబుట్టలో పరచి, తర్వాత బుట్టని
విత్తనాలతో నింపి సుమారు 10 నుండి 12 లీ. నీటిని బుట్టపై పోయాలి.
బుట్టని గున్నంగి ఆకులతో కప్పి దాని పై బరువుంచాలి. విత్తనాలను 24
గంటలు కదిలించకుండా ఉంచాలి. విత్తనాలు నారుమడిలో విత్తడానికి
సిద్ధంగా ఉంటాయి. ఈ పద్ధతి వల్ల విత్తనాలు త్వరగా దృఢంగా
మొలకెత్తుతాయి.
అమృతపాణి/పంచగవ్య/జీవామృతం ఉపయోగించటం వరి
విత్తనాలను అమృతపాణి/పంచగవ్య/జీవామృతంతో కూడా శుద్ధి
చేయవచ్చు.
జీవన ఎరువులనుపయోగించడం అజోస్పైరిల్లం/అజటోబాక్టర్/
సూడోమోనాస్ జీవన ఎరువులను ఎకరానికి 0.5 కి. చొప్పున
ముందుగా 1 లీ. చల్లార్చిన అన్నం గంజితో కలపాలి. మొలకలొచ్చిన
విత్తనాలను శుభ్రమైన నేలపై పరచి, జీవన ఎరువులు స్లర్రీలో
బాగాకలపాలి. విత్తనాలను, జీవన ఎరువుల స్లర్రీని కుండలో వేసి
కూడా కలుపవచ్చు. విత్తే ముందు అరగంట నీడలో ఆరబెట్టి విత్తాలి.
విత్తనాలను అరగంట సేపు విత్తే ముందు ఎండలో ఆరబెట్టడం వల్ల
మొలకశాతం, నారు మొక్క దృఢత్వం పెరుగుతుంది.

నారుమడి తయారీ సుమారు 320 చదరపు అడుగులు
నారుమడి ఒక ఎకరానికి సరిపోయే నారు పెంచడానికి అవసరం.
నారుమడి ప్రదేశాన్ని 2 సార్లు దున్నిన తరువాత భూమిపై వేప
ఆకులను చల్లాలి. ఆకులను నీటిలో
6-7 రోజులు కుళ్ళనివ్వాలి. ఆకులు
పూర్తిగా కుళ్ళిన తర్వాత భూమిని
మరలా 2 సార్లు దమ్ము చేయాలి.
వేపఆకులు దొరకకపోతే 3.2-4.0 కి.
వేపపిండి, 4-6 కి., వర్మికంపోస్టు
ఆఖరి దుక్కిలో వేయాలి. తర్వాత
భూమిని చదును చేసి విత్తనాలను
విత్తాలి. పచ్చిరొట్ట కలియదున్నిన
తరువాత వారం పదిరోజులకు
కుళ్ళుతుంది. అవకాశం ఉంటే తొలి
దుక్కిలోనే వేప, సీతాఫలం, జిల్లేడు,
అడ్డసరం, వెంపలి, అడ్డసరం తదితర
ఆకులను కలియదున్నాలి. దీనివలన
నారుమడికి సహజ సస్యరక్షణ
లభిస్తుంది. నారుమడి నుంచి మురుగు
నీరు బయటకు వెళ్ళే ఏర్పాటు
"ఉండాలి. సంప్రదాయ పద్దతిలో
వరిసాగుకు 320 చదరపు అడుగుల
నారుమడి సరిపోతుంది. అయితే
ప్రాకృతిక సేంద్రియ వ్యవసాయ
పద్దతిలో విత్తన వినియోగం చాలా
పెరిగి కుదురుకు ఒక్కటే మొక్కను
తగ్గుతుంది. వరుసల మధ్య దూరం
పెట్టడం వలన విత్తన అవసరం,
నారుమడి విస్తీర్ణం తగ్గుతోంది.
అనుసరించే విధానాన్నిబట్టి నారుమడి
విస్తీర్ణం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

ప్రధాన క్షేత్రం తయారీ

పొలాన్ని ఇరువాలు దున్నిన
తరువాత ఒడ్డుఒరం తీసి
వేసుకోవాలి. నారు 20 రోజుల
వయస్సు వచ్చేసరికి దమ్ము చేసి
గొర్రు తిప్పి చదును చేసుకోవాలి.
దమ్ము చేసే సమయంలో ఎకరాకు
200 కిలోల ఘనజీవామృతం
లేదా బ్యాక్టీరియాతో పులిసిన
పశువుల ఎరువు వేసుకోవాలి.
గట్లమీద గడ్డీగాదం తొలగించి
బంతి, రుద్రాక్ష తులసి వంటి
మొక్కలను రక్షక పంటల శ్రేణిగా
నాటుకోవాలి. గట్లు పెద్దగా
వున్నట్లయితే కంది వంటి
పప్పుధాన్యపు పంటలను
నాటుకుంటే తీగజాతి కూరగాయ
వేసుకోవచ్చు. అవిశ మొక్కలు
మొక్కలు వేసుకోవచ్చు. ఈ
మొక్కలు పశుగ్రాసానికి,
పక్షస్థావరాలుగానూ
ఉపయోగపడతాయి. నేలలో
కలగలపడానికి పచ్చిరొట్టగా
పనికివస్తుంది. ఫలితంగా
సేంద్రీయ కర్బనం (హ్యూమస్)ను
పెంచుతుంది. నేల గుల్లబారి
మొక్కకు, వేర్లకు తగిన గాలి అంది
వేరువ్యవస్థ బలపడుతుంది.
సూక్ష్మజీవుల సంతతి బాగా
పెరుగుతుంది. నారు తీసినప్పుడు
సులభంగా వస్తుంది.

నారుమడిలో పురుగులు,
తెగుళ్ళ యాజమాన్యం:
    పచ్చదీపపు
పురుగులు, పచ్చకొమ్ము వున్న లార్వాలు,
గోధుమరంగు ఆకుమచ్చ, అగ్గితెగులు
నారుమొక్కలను ఆశిస్తాయి. అందువలన పంట తొలిదశలో నష్టం కలుగుతుంది. వీటి నివారణకు 1%
ఆవుమూత్రం ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు మొక్కలపై
తెగులు మొదటి లక్షణాలు కన్పించగానే పిచికారి చేయాలి. వెంటనే
పురుగు, తెగులు యాజమాన్య పద్ధతులను ఆచరించాలి.
జీవన ఎరువుల వినియోగం నారుమడి అంకురాలు ఎత్తి అంగుళం
పెరిగిన తరువాత బాగా చివికిన పశువుల ఎరువులో అజోస్పైరిల్లం కలిపి
వృద్ధి చేసి చల్లుకోవాలి. నారుమడికి పలుచగా నీరు పెట్టి అందులోనే
ఇంకేట్లు చేయాలి. సూడోమోనాస్సు విత్తనాలకు పట్టించి చల్లుకోవాలి,
నారును ప్రధాన పొలంలో నాటుకోవడానికి ముందు శుద్ధి చేసుకోవాలి.
నారు శుద్ధికి ప్రకృతి వ్యవసాయదారులు, సేంద్రీయ వ్యవసాయదారులు
పలు పద్ధతులు వాడుతున్నారు.
నారుమొక్కల శుద్ధి
వరినారు మొక్కలను నాటేముందు బూడిద, వేపగింజల పొడి
మిశ్రమంతో శుద్ధి చేయాలి. దీనికొరకు, నారు మొక్కల కట్టలను
బూడిద, వేపగింజల పొడి కలిపిన నీరు నిలచి ఉన్న చిన్న
మడులలో 30 ని. నుండి 1 గంట ఉంచి తర్వాత నాటాలి. 50
నారు కట్టలను శుద్ధి చేయడానికి ఒక కిలో బూడిద, 500 గ్రా.
వేప విత్తనాలు సరిపోతాయి. శుద్ది చేసిన నారు మొక్కలు
పురుగులు, తెగుళ్ళు ఆశించని పంటనిస్తాయి. పొలంలో ఒకచోట
పది అడుగుల వైశాల్యంలో చుట్టూర 4 నుంచి 6 అంగుళాల మేర
గట్లు వేసి అందులో నీరు నిల్వకట్టాలి. అందులో 5% పంచగవ్య
కలిపి నారుకట్టలు అరగంటపాటు నానబెట్టుకోవాలి. దీనికోసం
బీజామృతం, అమృతపాణి కూడా వాడవచ్చు.
వేరుశనగ పిండి, వేపపిండిని నీటిలో రాత్రంతా నానబెట్టి
వడపోయాలి. ఈ ద్రావణంలో నారుమొక్కలను శుద్ది చేసి
నాటాలి. శుద్ధి చేసి నాటిన నారు మొక్కలను పురుగులాశించవు.
నాట్లు వేసుకోవడం సంప్రదాయ పద్దతిలో వరినాట్లు కుదురుకు
నాలుగైదు మొక్కలు నాటుతారు. మొక్కకు-మొక్కకు మధ్య దూరం
ఏదో మొక్క బతుకుతుందనే ఆలోచనతో ఈ విధంగా చేస్తారు.
కూడా తగ్గుతుంది. నీటి యాజమాన్యంలో ఒడిదుడుకులు వచ్చినా
సాటుకుంటేనే దుబ్బు బలంగా అభివృద్ధి చెందుతుంది.
వాస్తవానికి వరి నీటి మొక్క కాదు. వరిలో ఏరకమైనా ఒంటి కర్ర నాటుకుంటేనే దుబ్బు బలంగా అభివృద్ధి చెందుతుంది.
భూమిలోని కొన్ని సూక్ష్మజీవులు నత్రజని స్థిరీకరించి మొక్కలు తేలికగా గ్రహించే రూపంలోకి మారుస్తాయి. అజాటోబాక్టర్, అస్పైరిల్లం, ఫాస్పో బాక్టీరియా వరి సేంద్రియ సాగులో
ఉపయోగించే జీవన ఎరువులు. ఇవి రసాయన ఎరువుల వాడకానికయ్యే అధిక ఖర్చులను తగ్గించడమేకాక పంట దిగుబడులను
పెంచి, భూసారాన్ని వృద్ధి చేస్తాయి,

మొక్కల పెరుగుదలను క్రమబద్దీకరించే పదార్థాలు

పంచగవ్య దీనిని ఆవు నుండి ఉత్పత్తయ్యే 5 పదార్థాలతోపాటు
ఇంకొన్ని జీవ ఉత్పత్తులను కలిపి పులియబెట్టి ఉపయోగిస్తారు.
ముతకబియ్యం రకాలలో పిలకదశలో ఒకసారి, పోటాకుదశలో
ఇంకొకసారి 3% పంచగవ్య పిచికారి చేయాలి,
సన్నబియ్యం రకాలకు, పోటాకుదశలో 3% పంచగవ్య ద్రావణాన్ని
ఒకసారి పిచికారీ చేయాలి.
అమృతకరైసాల్ ఒక ఎకరం వరి పంటకి 600 లీ.
అమృతకరైపాల్ సాగునీటి ద్వారా అందించాలి. పంటపై పిచికారి
చేయడానికి 10 లీ. అమృతకలైపాల్ అవసరం, ఇది భూసారాన్ని
పెంచి అధిక దిగుబడులనిస్తుంది.
పచ్చిరొట్టపైర్లు ప్రధాన పంటను సాగు చేసే ముందు పచ్చిరొట్ట
పైర్లను పొలంలో సాగు చేస్తారు. పూత దశకు రాకముందే వాటిని
భూమిలో కలియదునుతారు. ఈ మొక్కలు తమ వేరుబుడిపెలలో
ఉన్న కొన్ని ప్రత్యేక సూక్ష్మజీవుల ద్వారా వాతావరణంలోని నత్రజనిని
స్థిరీకరించి మొక్కలు ఉపయోగించుకునే స్థితిలోకి మారుస్తాయి. ఈ
పంటలను ప్రధాన పంటకు ముందుగా తప్పనిసరిగా పెంచితే
లాభదాయకం.
ఉపయోగించే పద్ధతి; దభోల్కర్ పద్దతిలో పచ్చిరొట్ట పైర్లను వరి
పంటకాలం ముందు పెంచాలి. విత్తిన 45-50 రోజుల తర్వాత
వాటిని భూమిలోకి కలియదున్నాలి. ఈ మొక్కలను 10 రోజులు
నీటిలో కుళ్ళనిచ్చి తర్వాత దున్నాలి.

పోషకాల యాజమాన్యం:

 పైరు నాటిన తర్వాత తొలిసారి
కోనోవీడర్ తిప్పి జీవామృతం వినియోగించాలి. పైపాటుగా పంచగవం
చేప లేదా కోడిగుడ్ల అమినోఆమ్ల ద్రావణాన్ని పిచికారి చేసుకోవచ్చు
వీలునుబట్టి 300 కి. ఘనజీవామృతం చల్లుకోవచ్చు. తొలిసారి వీడర్
తిప్పిన తర్వాత అజోల్లా చల్లుకుంటే పొలమంతా విస్తరించి నత్రజని
సమకూరుతుంది.

కలుపు యాజమాన్యం :
        కలుపు మొక్కలను చేతితో పీకి, పీకిన
మొక్కలను పొలంలో దిగతొక్కితే మొక్కలకు పోషకాలందుతాయి.
నాటిన 15-20 రోజుల తర్వాత మొదటిసారి కలుపుతీయాలి. నీటిని
5-8 సెం.మీ. ఎత్తు వరకు నిలువ ఉంచితే కలుపునదుపులో
ఉంచవచ్చు. నాటిన వరిలో ఊద, బొంత ఊద, నీటి తుంగ,
గుంటగలగరాకు, నక్షత్ర గడ్డి, బ్రహ్మతుంగ, రాకాసితుంగ, పిల్లి
అడుగుఆకు, నీటితామర, కొర్రగడ్డి, అల్లిగడ్డి కన్పిస్తాయి.
        జిల్లేడు ఆకులను పచ్చి ఆకు ఎరువుగా ఉపయోగించి పిల్లి అడుగు
ఆకును అరికట్టవచ్చు. ఎకరానికి 10 బుట్టల కొబ్బరిపీచు వేసి కూడా
ఈ కలుపు మొక్కను కొంతవరకు అరికట్టవచ్చు. కొబ్బరి పీచు టానిన్
వంటి పదార్థాన్ని విడుదల చేసి కలుపు పెరుగుదలను అరికడుతుంది.
          దమ్ముచే సేటప్పుడు నేలలో విషముష్టి, జిల్లేడు ఆకులను
దిగదొక్కితే అవి మురిగిన తర్వాత వెలువడే ఆల్కలాయిడ్స్ కారణంగా
కలుపు ఉధృతి చాలా తగ్గుతుంది. నాటు తరువాత ముక్కలుగా నరికినజిల్లేడు ఆకులను మూటకట్టి మెరుగు (నీటికాలువలో వేస్తే జిల్లేడు
ఆకుల రసం నిరంతరం కాలువల్లో ప్రవహించి కలుపును అదుపు
చేయడమే కాకుండా వరిని ఆశించే మొగిపురుగును నిర్మూలిస్తుంది.

నీటి యాజమాన్యం :

నాటపుడు పొలంలో కనీసం 2
సెం.మీ. నీరుండాలి. నాటిన 10వ రోజు నుండి పంట పరిపక్వత
కొచ్చే వరకు కనీసం 3 సెం.మీ. నీరుండేటట్లు చూడాలి. ప్రత్యేకంగా
కీలకదశలైన పిలక దశ, పూతదశ, పాలు పోసుకునే దశలలో నీరు
అవసరం. ఎక్కువగా నీరు నిలబడిన పొలాల్లో పైపాటుగా ఎరువులు
వేయరాదు. ఎరువు వేసేముందు నీటిని బయటకు పాటించి, పొలం
ఆరిన తర్వాత ఎరువు వేయాలి. ఎరువు వేసిన వెంటనే నీరివ్వాలి.
    ఎర్రనేలల్లో, ఇసుక నేలల్లో నీటి అవసరమెక్కువ. అందువలన ఆ
నేలల్లో ఎక్కువసార్లు నీరివ్వాలి, తూటికాడ (ఐపోమియా ఫిస్ట్యులోసా)
మొక్కలను భూమిలో వేసి కలియదున్నితే, అవి కుళ్ళి భూమిలో నీటిని
నిలుపుకునే శక్తి పెరుగుతుంది.
పొట్టదశ ఈనే దశలో తీసుకోవలసిన జాగ్రత్తలు

*చిరుపొట్ట దశలో జీవామృతం లేదా 5 శాతం పంచగవ్య పిచికారి
చేయాలి.
*గింజ పాలుపోసుకునే దశలో పైరుకు కాల్సియం అవసరమౌతుంది,
పులిసిన మజ్జిగ పిచికారి చేస్తే పైరుకు కాల్షియం లభిస్తుంది,
లీటరు పులిసిన మజ్జిగ 20 లీ. నీటితో కలిపి పిచికారి చేయాలి.

సస్యరక్షణ యాజమాన్యం:
    వరి సాగులో తెగుళ్ళు, కీటకాల
వలన కొన్ని సందర్భాల్లో 20 నుంచి 90 శాతం దిగుబడులు
నష్టపోయే పరిస్థితి ఉంది. వరీ ఏకపంటగా సాగు చేయడం వలన
నారుమడి స్థాయి నుండి పురుగు, తెగులు మందులను
విచక్షణారహితంగా మోతాదుకి మించి వినియోగిస్తున్న ఫలితంగా
విషరసాయనాలు బియ్యంలోకి కూడా చేరి తినే ఆహారం విషతుల్యంగా
మారుతుంది. సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా మాత్రమే ఈ
సమస్యను అధిగమించవచ్చు.

గట్లపై ఎర పంటల సాగు:
 పొలం గట్ల మీద నత్రజని సిరీకరించే పప్పుధాన్యాల పంటలను వేసుకోవాలి. గట్లు పెద్దగా ఉన్నచోట కంది మొక్కలను నాటడం ద్వారా వరిపైరును ఆశించే కీటకాలను భక్షించే మిత్ర పురుగులకు ఆశ్రయంగా మారడంతో పాటు వాతావరణంలో లభించే నత్రజనిని స్థిరీకరిస్తాయి. కందుల వలన అదనపు ఆదాయం సమకూరతుంది. కంది వేర్ల అల్లిక వల్ల భూమి కోత నివారించబడటం జరుగుతుంది. కంది మొక్కల మధ్య బంతి నాటడం వలన వాటి పూలకు ఆకర్శితమయ్యే తేనెటీగలు, కందిరీగలు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి వరిని ఆశించే
మొక్కలు నాటుకోవడం ద్వారా నులిపురుగులను నిర్మూలించడమేకాక
తెల్లదోమను పారదోల వచ్చు. ఇవే గట్ల పైన సజ్జ, తులసి మొక్కలు
కాండం తొలుచు పురుగులకు సహజ శత్రువులు కావడం వలన ఆయా కీటకాల లార్వాలను తిని పురుగులను నియంత్రణలో ఉంచుతాయి
లేదా పూర్తిగా నిర్మూలిస్తాయి.

ఔషధ మొక్కల కషాయాలు:

ఇవి కీటక నివారణ సహజ
ఔషధాలు. పొలం పరిసరాల్లో లభించే చేదు, గాధమైన వాసన,
పాలుగారే లక్షణాలున్న మొక్కల ఆకులు సేకరించాలి. వేప,
సీతాఫలం, కుక్కతులసి, జిల్లేడు, ఉమ్మెత్త, పాలకొడిశ, అడ్డసరం,తూటేరు తదితర జాతుల ఆకులను లేదా మేకలు, గొర్రెలు తినని మొక్కల ఆకులను రకానికి కనీసం 2 కిలోలు సేకరించి ముద్దగా నూరి సమాన పరిమాణంలో ఆవుమూత్రం ఒక డ్రమ్ములో పోసి అందులో
పులియబెట్టాలి. 7-10 రోజుల్లో ఆకుల గుట్టు ఆవు మూత్రంలో చివికి
పోతుంది. ఈ ద్రావణాన్ని వడకట్టి లీటరు కషాయాన్ని 10 లీటర్ల
నీటిలో కలిపి పైరు మీద పిచికారీ చేయడం ద్వారా అన్ని రకాల
కీటకాలను నియంత్రించవచ్చు.

వేపగింజల కషాయం:
5 శాతం వేపగింజల కషాయం పైరుపై
చల్లడం వల్ల తల్లిపురుగులు ఆకులపై గుడ్లు పెట్టకుండా
నివారించుతుంది.
తయారీ విధానం:
     వేపపళ్ళను సేకరించి నీడలో ఆరబెట్టాలి.
నీటిలో నానబెట్టి గింజలను వేరు చేయాలి. ఎకరానికి 8 కిలోల వేప
గింజలు మెత్తగా రుబ్బి పిండి చేయాలి లేదా వేప పిండిని ఓ మూటలో
కట్టి 10-12 గంటలు నానబెట్టాలి. నీటిలో మూటను ముంచి
పట్టుకుని 15-20 నిమిషాల పాటు కషాయాన్ని పిండాలి. ఈ
ద్రావణాన్ని గుడ్డలో వడపోసి 100 గ్రాముల సబ్బుపొడి కలపాలి. ఈ
వేప కషాయాన్ని 100 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలో పిచికారి
చేసుకోవాలి.

వెల్లుల్లి-అల్లం-పచ్చిమిర్చి ద్రావణం:
 వెల్లుల్లి 4 కిలోలు, అల్లం 2 కిలోలు, పచ్చిమిరప 2 కిలోలు మెత్తగా రుబ్బి 28 లీటర్ల నీటిలో కలిపి
వడకట్టగా వచ్చిన ద్రావణాన్ని నీటిలో కలిపి 200 లీటర్లు చేసి ఎకరా
పైరు పై పిచికారి చేయాలి.

జీవనియంత్రణ:
ట్రైకోగ్రామా జపానికం గుడ్లు (ఎకరానికి 20,000) గల కార్డులను వరి చేలో తాటి లేదా కొబ్బరి ఆకులకు
గుండుసూదితో లేదా తుమ్మముల్లుతో గుచ్చి అక్కడక్కడ పెట్టాలి. ఈ
గొంగళిపురుగులను అరికడతాయి.
గుడ్లు పొదిగి పిల్లలుగా మారి ఆకుముడత, కాండంతాలిచే పురుగులను అరికడతాయి.

జిగురుపూసిన అట్టలు:
 వరి పొలంలో పసుపు, తెలుపు, నీలం
రంగు అట్ట ముక్కలను ఒక కర్రకు మేకుతో బిగించి అక్కడక్కడ
రంగుకు ఆకర్షితమై వాలిన కీటకాలు జిగురుకు అంటుకుని
పాతాలి. వీటి మీద జిగురు పదార్థం లేదా గ్రీజు పూయడం వలన
నశిస్తాయి. పాతకుండలు, కొబ్బరిబోండాలు, ప్లాస్టిక్, ఇనుప
డబ్బాలకు రంగు వేసి గ్రీజు రాసి ఉపయోగించుకోవచ్చు.

పక్షిస్తాపరాలు:
 వరి చేలో పలు చోట్ల అడ్డుకర్రలను కట్టి
నాటుకోవాలి. నూకలు లేదా బియ్యంలో పసుపు కలిపి వండిన
కీటకాలను ఏరుకుతింటాయి,
అన్నాన్ని పక్షి స్థావరాల పరిసరాల్లో 2-3 రోజులు వెదజల్లితే పక్షులు
పూర్తవగానే భూమిని ఉనాం
ఆలవాటుపడి ఈ స్థావరాలపై సేదతీరుతూ పంటకు హాని చేసే కీటకాలను ఏరుకుతింటుంది.

కాండం తొలుచు పురుగుల నివారణ:
*పురుగుల గుడ్లను, ప్యూపాలను నాశనం చేయడానికి పంటకోత పూర్తవ్వగానే భూమిని దున్నాలి.
*16.8-20 కి. వేపపిండిని ఆఖరి దుక్కిలో వేయాలి.
*వేపపిండి నింపిన సంచులను సాగు నీరు ప్రవహించే కాలువలో
ఉంచాలి..
*ట్రైకోగ్రామా బ్రెసిలియెన్సిస్, టెలినోమస్ ఫెలిఫెసిమెన్స్ కార్డులు
వాణిజ్యపరంగా లభిస్తున్నాయి. ఇవి కాండంతొలుచు పురుగుల
గుడ్ల సముదాయాన్ని నాశనం చేస్తాయి.
*పెద్ద మగ పురుగులను ఫిరమోన్ ఎరలనుపయోగించి ఆకర్షించి
ఎరలో పడేటట్లు చేయవచ్చు. ఎకరానికి 3-4 ఫెరమోన్ ఎరలను
ఉపయోగించాలి. ఈ పద్ధతి ద్వారా పురుగుల సంఖ్యనరికట్టవచ్చు.
*పెద్ద పురుగులను దీపపు ఎరలనుపయోగించి ఆకర్షింపజేసి
నాశనం చేయవచ్చు.
*పసుపు దుంప కషాయాన్ని పిచికారి చేయాలి.
*ఉమ్మెత్త ఆకులను, కొమ్మలను పొలంలో వెదజల్లి కుళ్ళనివ్వాలి.
అవి పురుగు వికర్షిణులుగా పనిచేస్తాయి.
*సీతాఫలం నూనె, ఆకుల కషాయం లేదా కాయల పొడితో చేసిన
కషాయాలతో నివారించవచ్చు. దీనితో పాటుగా దుక్కిలో ఎకరాకు
20 నుండి 30 కిలోల వేపపిండిని వేయడం ద్వారా కూడా ఈ పురుగుని నివారించవచ్చు
*20 కిలోల జిల్లేడు ఆకును ఒక గోతంలో వేసి దంచి నీటి కాలువలో వేయాలి.
       సీతాఫలం నూనె లీటరుకు 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారి
చేసి, ఎండబెట్టి పొడిచేసి, కిలోపొడికి 5 లీ. నీరు, కిలో పేడ, 5 లీటర్ల
చేసుకోవచ్చు. నూనె అందుబాటులో లేకపోతే కాయలను ముక్కలు
ఆవుమూత్రం కలిపి మరిగించి వడపోసిన దావణం 5 మి.లీ. ఒక
లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.

దీనికి 2

తూటేరు + తులసి కషాయం తయారీ:

 2 కిలోల తూటేరు లేత ఆకులు, 2 కిలోల తులసి ఆ
ముద్దగా నూరి 10 లీటర్ల నీటిలో కలపాలి. దీనికి 2లీటర్ల
ఆవుమూత్రం, 2 కిలోల పేడవేసి మురగబెట్టాలి. 10 రోజుల తర్వాత
దీనిని వడకట్టి 100 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి
చేసి కాండంతొలిచే పురుగును సమర్ధవంతంగా నివారించవచ్చు.

*కాండంతొలిచే పురుగు ఆశించిన పొలాన్ని ఆరగట్టాలి. దీనివలన
లార్వాలు మరణిస్తాయి. ఆరగట్టడం వీలుగాని డెల్టా ప్రాంతంలో
నీటిమట్టం పెంచి, తీస్తూ ఉండాలి. దీనివలన లార్వాలకు
ప్రాణవాయువు అందక మరణిస్తాయి.
*సాగు నీటి కాలవలో పచ్చి పేడ వేస్తే ఇది నీటిలో కరిగి
పొలమంతా విస్తరించి లార్వాలను నాశనం చేస్తుంది.
*ఉత్తరాంధ్ర ప్రాంతంలో విరివిగా పెరిగే కంపురొడ్డ, మిడతకర్ర
అనే కలుపు మొక్కలు కోసి తెచ్చి గట్లు మీద కుప్పలుగా వేయడం,
నీటి కాలువలో వేయడం వలన ఈ వాసనకు దరిచేరవు.
*తమిళనాడు రైతులు పొలం గట్ల మీద వావిలాకు, సీతాఫలం ఆకులను కాల్చి పొగపెట్టడం ద్వారా కాండంతొలుచు పురుగుల
నివారణలో మంచి ఫలితాలు పొందారు,
*ఆవుమూత్రం, వావిలాకు, ఇంగువ కషాయం తయారు చేసుకుని
వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసి ఈ పురుగును
నివారించవచ్చు.
*అర లీటరు వేపనూనెను 4 కిలోల మట్టితో కలిపి దానికి మరో 4
కిలోల పేడ కలిపి ముద్ద చేసి, పులిపచ్చిగా ఉన్న దశలో
పొలమంతా వెదజల్లుకోవాలి.
*వావిలాకు, పిసింగి ఆకు, వేపగింజల పొడి, కలబందలను ప్రతిదీ
ఒక కిలో చొప్పున సేకరించి 20 లీటర్ల ఆవుమూత్రంతో కలిపి
బాగా మరిగించి వడకట్టి పెట్టుకోవాలి. 2 లీటర్ల ఈ ద్రావణాన్ని
100 లీటర్ల నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారి చేయాలి.
పిచికారి చేసిన వారం తర్వాత పంటను పరిశీలించి అవసరమైతే
రెండోసారి పిచికారి చేసుకోవాలి.
*కాండంతొలిచే పురుగు ఆశించిన పైరు కోసిన తర్వాత వరి
దుబ్బులు తగులబెడితే అందులోని లార్వాలు, గుడ్లు నశిస్తాయి.

ఆకుముడత:
దీని తీవ్రత అధికంగా ఉంటే చేసుపై రేగు కంపను తాగాలి. దీనివలన లార్వాలు కింద నీటిలో పడిపోతాయి. కంప లాగిన రెండు రోజులు 2 అంగుళాల నీరు మడిలో నిల్వ ఉంటే అందులో మునిగి చనిపోతాయి. కంపలాగిన తర్వాత నీమాస్త్రం లేదా వేపగింజల కషాయం పిచికారి చేస్తే ఆకుముడత నివారించబడుతుంది.
*అడవి ఆముదం ఆకులు 20 కిలోలు సేకరించి ముద్దగా దంచి
250 లీటర్ల నీటిలో కలిపి రెండు రోజులు ఉంచి వడపోసి
పిచికారి చేస్తే ఆకుముడత నివారించబడుతుంది.
*రెండు కిలోల ఉప్పుని 8 కిలోల కర్ర లేదా పీడకబూడిదతో కలిపి
దానిని 200 లీ. నీటికి కలిపి పిచికారి చేస్తే ఆకుముడత
నివారించబడుతుంది.
*దళపత్ర కషాయం పిచికారి చేసి నివారించవచ్చు.

గొట్టాల పురుగు (కేస్ వర్మ్):

*పొలంలో ఉన్న లార్వాలను పంటపై త్రాడులాగి నివారించవచ్చు.
*చామ, నిమ్మ ఆకులను ముక్కలుగా కత్తిరించి పొలంలో వెదజల్లితే  అవి పురుగు వికర్షిణిగా పనిచేస్తాయి.
*3-4 రోజులు పొలంలో నిలిచి ఉన్న నీటిని బయటకు పంపించాలి. లేదా నిలిచివున్న నీటిలో బాజా ఆవు పేడ వేయాలి.

ఆకులుతినే గొంగళి పురుగులు:
*వేపపిండిని ఆఖరిదుక్కిలోనే వేయాలి. దీనివలన ఆకులను తినే
గొంగళిపురుగులు పొలంలోకి ప్రవేశించవు.
*5 జిల్లేడు ఆకులను మట్టి కుండలో 10 లీ. ఆవుమూత్రం, 5
లీ. నీరు కలిపిన మిశ్రమంలో 3-5 రోజులు నానబెట్టి, వడకట్టి
80 లీ. నీటిలో కలిపి పంటపై పిచికారి చేయాలి.
*ఎకరం పొలంలో 10 వేప ఆకుల గుత్తులను 10 వేర్వేరు స్థలాల్లో
ఉంచాలి.
*ఎకరానికి 10 కి. కొయ్యబూడిదను ఇసుకలో కలిపి పొలంలో
చల్లాలి.
*పొలంలో నీరు నింపి బయటకు పంపించాలి.

ఉల్లికోడు:
 వడిశాకు (క్లిస్టాంథస్ కోలినస్) తాజా ఆకులను 100
చ.మీ.కి. 10 కి, చొప్పున పురుగు ఆశించిన తొలిదశలో చల్లాలి.

పచ్చదీపపు పురుగులు:
*నాటే ముందు నారు మొక్కలను 5% వేపగింజల కషాయంలో 24
గంటలు శుద్ధి చేయాలి.
*వేపనూనె, కానుగనూనె 1:4 నిష్పత్తిలో కలిపి పిచికారి చేయాలి.
*పురుగులు గుడ్లు పెట్టే గడ్డి, కలుపు మొక్కలను పొలం నుండి,
పొలం గట్ల నుండి తొలగించాలి.

సుడిదోమ:
*పొలంలో నీరు ఎక్కువగా నిలిచి ఉండకుండా చూడాలి.
*దీపపు ఎరలనుపయోగించి సుడిదోమ పెద్ద పురుగులనాకర్షించి
చంపాలి.
*పొలంలో, పొలంగట్లపై కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి.
*మొక్కలను సరైన దూరంలో నాటాలి.
*జిల్లేడు ఆకులను మొక్కల వరుసల మధ్యలో వేసి భూమిలో కలపాలి.
*తూటేరుఆకు కషాయం సుడిదోమకు సమర్థవంతంగా పనిచేస్తుంది.

కంకినల్లి:
*కామాక్షి (సైకాస్) పూవులను కోసి పంటస్థాయి కన్నా ఎక్కువ ఎత్తు
వున్న కర్రలకు కట్టాలి. ఈ కర్రలను గడ్డితో పాటు పొలంలో 10-15 చోట్ల పాతాలి. దీని వాసనకు పెద్ద నల్లులు వికర్షించబడి రెండు వారాలపాటు పొలంలోకి ప్రవేశించలేదు. ఈ సమయానికి పాలుపోసుకునే దశ పూర్తయి, పంట పరిపక్వదశకు చేరుకుంటుంది.
*ఉత్తరేణి మొక్కల వేర్లు (10 కి. వేపబెరడు (5 కి.) ఎండబెట్టి
పొడి చేయాలి. 100 లీటర్ల నీటిలో ఉరేసి 10 రోజుల తర్వాత
వడకట్టి పిచికారి చేయాలి.
*ఒక లీటరు కిరోసిన్ని 4-5 కి. వరి తపుడులో కలిపి వెదజల్లాలి.

సాధారణ పురుగు యాజమాన్య పద్ధతులు:
*జిల్లేడు కొమ్మలను సాగునీరు పారే కాల్వలలో ఉంచాలి. దీని
పాలలో ఉండే ఆల్కలాయిడ్ పురుగు వికర్షిణిగా పని చేస్తుంది.
*30-40 కి. నల్లేరు ఆకులను 10 లీ. నీటిలో కలిపి 1 లీటరు
ద్రావణం మాత్రమే మిగులు వరకు మరగబెట్టాలి. దీనికి 10 గ్రా,
ఇంగువ, 5 లీ. ఆవు మూత్రం కలపాలి. ఈ ద్రావణాన్ని బాగా
కలిపి, వడపోసి పంటపై పిచికారి చేయాలి. నల్లేరు ఆకులను
పురుగులాశించడం గమనించగానే వెదజల్లి వేర్లు, కాండంనాశించే
పురుగులను నివారించవచ్చు.
*సీతాఫలం ఆకులను లేదా విత్తనాల పొడిని పొలంలో వెదజల్లితే
దీని వాసనకు పురుగులు వికర్షించబడతాయి.
*గన్నేరు, ఉమ్మెత్త, సీతాఫలం, అగ్నిశిఖ (గ్లోరియోసా సువర్బా) ఆకులను, విషముష్టి (నక్స్వామిక) కాయలను చిన్న ముక్కలుగా
కత్తిరించి 5 లీ. నీరున్న మట్టి కుండలో వేయాలి. మట్టి కుండపై
మూత పెట్టి ఎరుపు కుప్పలో ఒకవారం పాతి పెట్టాలి. తర్వాత
కుండలోని పదార్ధాలను వేడి చేసి, చల్లార్చి, వడపోసి పిచికారి
చేయాలి. ఎకరానికి 0.8-1.2 లీ, ద్రావణాన్ని ఎకరంలోని
పంటపై 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
*వేపఆకులను, అస్తిసంహారక (సిస్పస్ క్వాడ్రాంగ్యులారిస్)ఆకులను సమపాళ్ళలో తీసుకుని, నూరి ఆవుమూత్రంలో ఒక
వారం నానబెట్టి తర్వాత వడపోయాలి. వడపోసిన ద్రావణాన్ని
నీటిలో 1:9 నిష్పత్తిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు
పిచికారి చేయాలి.
*పరిపక్వదశలో ఒక పొడవాటి కర్ర చివరన కాకి శవాన్ని లేదా
సలుపు లేదా ఎరుపు గుడ్డముక్కుని కట్టి పాతడం లేదా ఖాళీ ఉన్నా డబ్బ లేదా డ్రమ్ ను కర్రతో మ్రోగించి గాని పక్షులను భయ పెట్టి
గింజలను నాశనం చేయకుండా చేయవచ్చు.

తెగుళ్ళు

అగ్గితెగులు:
*పొలం గట్లను శుభ్రంగా ఉంచాలి. 
*10 శాతం గోమూత్రం 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు
పిచికారీ చేయాలి.
*మారేడు, తులసి ఆకులు, ఆవుమూత్రం కషాయం
పిచికారీ చేయాలి.
*అరయ లేదా అడవిజామ (కారియా ఆర్బోరియా) బెరడుని
నలగొట్టి 2-3 కి, బెరడుని పొలంలో వేయాలి,
*ఒక కిలో తులసి ఆకులను 2 లీ. నీటిలో మరగబెట్టి, వడపోసిన
ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో 12 మి.లీ. లీటరు నీటికి
చొప్పున కలిపి పిచికారి చేయాలి.

బాక్టీరియా ఆకు ఎండుతెగులు : 
   1 లీటరు వర్మీవాష్ 0.5 లీటరు గోమూత్రం, 10 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.

 బాక్టీరియా, వైరస్ తెగుళ్ళ నివారణకు:
 10 కి. బొప్పాయి ఆకులు దంచి దాన్ని 200 లీ. నీటిలో నానబెట్టి పడకట్టిన ద్రావణం పిచికారి చేసి బాక్టీరియా, వైరస్ సంబంధిత తెగుళ్ళను అరికట్టవచ్చు.

వైరల్, బాక్టీరియా, శిలీంద్ర తెగుళ్ళ నివారణకు:
 ఎర్రగలిజేరు (అటకమామిడి) సమూలంగా పెరికి దంచి ఆవుమూత్రంలో
నానబెట్టిన కషాయం అన్ని రకాల వైరల్, బాక్టీరియా, శిలీంద్రసంబంధిత తెగుళ్ళను అరికడుతుంది.

గోధుమరంగు ఆకుమచ్చ:
 విత్తనాలను 20% మెంతి ఆకు
ద్రావణంలో 24 గంటలు నానబెట్టాలి. వడిసాకు (క్లిస్టాంథస్ కోలినస్)
ఆకులను ఎకరానికి 10 క్వి, చొప్పున వెదజల్లి కుళ్ళనివ్వాలి. 3 రోజుల
తర్వాత నీరు పెట్టాలి. బూడిదను పంటపై చల్లి తెగులు విస్తరించకుండా
చేయవచ్చు.

పాముపాడతెగులు, కాండంకుళ్ళు తెగులు, బాక్టీరియా
ఆకు ఎండు తెగులు:
 20 కి, ఆవు పేడను 200 లీ. నీటిలో కలిపి స్లర్రిీ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని గోనె సంచితో వడపోయాలి.
వడపోసిన ద్రావణాన్ని 50 లీ. నీటిలో కలిపి ఉంచాలి. తర్వాత
పైనున్న తేటని సమీకరించి వడపోసి పిచికారి చేయాలి.

పొట్టకుళ్ళు: జిల్లేడు ఆకు ద్రావణం/ విప్ప కషాయం/నవధాన్య ద్రావణం

పాము పొడ తెగులు :
వేపగింజల ద్రావణం 1% / వేప+కానుగ నూనెలు 2 శాతం.

ఎండాకు తెగులు (బాక్టీరియల్ విల్ట్):
 తులసి + తమలపాకు+ పారిజాత ఆకుల ద్రావణం


పసుపు దుబ్బ తెగులు:
గంగరావి ద్రావణం ఉత్తరేణి కషాయం/హెర్బల్ టీ

టుంగ్రోవైరస్ (దీపపు పురుగులు):
కలబంద+తులసి ద్రావణం/వేప ద్రావణం వేపనూనె 2 లీ. 25 కి, ఇసుకతో కలిపి చల్లడం / వావిలాకు కషాయం / వేపపిండి నీటి ద్వారా అందించడం /వేపచెక్క మురగబెట్టి వాడటం / అటకమామిడి+పంచితం కషాయం.

వేరుకుళ్ళు:
 వేపపిండి/వేపాకు ద్రావణం/ గంగరావి ఆకు ద్రావణం 3 నుంచి 5 శాతం/
మీనామృతం 3 శాతం

తెగుళ్ళ సాధారణ యాజమాన్య పద్దతులు:
*ఆవుమూత్రాన్ని మట్టికుండలో తీసుకుని ఒక వారం
పులియనివ్వాలి. దీనిని పంటపై పిచికారి చేసి బాక్టీరియా, శిలీంద్ర
తెగుళ్ళను నివారించవచ్చు.
*ఒక లీటరు ఆవుమూత్రాన్ని ఒక లీటరు మజ్జిగ, 8 లీ. నీటిలో
కలిపిన మిశ్రమాన్ని పంటపై పిచికారి చేసి బాక్టీరియా, శిలీంద్ర
తెగుళ్ళను నివారించవచ్చు.
*300 మి.లీ. వస కషాయాన్ని ఒక లీటరు ఆవుమూత్రం, 8.7 లీ.
నీటిలో కలిపి పంటపై పిచికారి చేయాలి.

ఎలుకల నివారణ : 
ఎలుకలు కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 శాతం వరకు పంట నష్టాన్ని కలిగిస్తాయి. ఎలుకల నివారణకు గైరిసిడియా (గిరిపుష్పం) ఆకులు బాగా పనిచేస్తాయి. లాటిన్ భాషలో
గ్లీస్ సిడ్రో అంటే ఎలుకలను చంపడం అని అర్ధం. ఎలుకలను
చంపగలదు కాబట్టే ఈ మొక్కకు గైరిసిడియా అనే పేరు వచ్చింది.
మెత్తగా నూరిన గ్లైరిసిడియా ఆకులను బియ్యంలో కలిపి అన్నం వండి
ఈ ముద్దలను అక్కడక్కడ గట్ల వెంట వేయాలి. దీన్ని తిన్న ఎలుకలు
మరణిస్తాయి.
*సన్నగా తరిగిన పచ్చిబొప్పాయి ముక్కలను కలుగుల వద్ద వేయడం 
ద్వారా వాటిని తిన్న ఎలుకలకు పంటి చిగుర్లు నొప్పి పెడతాయి. 
దానితో ఎలుకలు మొక్కలను కొరికే శక్తిని కోల్పోతాయి.
*గట్ల పైన అక్కడక్కడ ఆముదం, జిల్లేడు, మొక్కలు ఉంటే వాటి
వాసనకు ఎలుకలు దూరంగా తరలిపోతాయి.


No comments