An artical about organic farming by venugopal reddy sir.
భారతదేశం నవనాగరికత ముసుగులో తన పూర్వ వైభవోపేతమైన సంస్కృతి ఔనత్యాన్ని కోల్పోతుంది. మన దేశంలో వ్యవసాయం ఈ నాటిది కాదు ; యుగ యుగాల నాటిది. త్రేతా యుగంలో జనక మహారాజు సేద్యం చేస్తుంటే నాగేటి చాలులో సీతమ్మ తల్లి దర్శనమిచ్చింది. సంస్కారవంతమైన మన దేశంలో అతి ప్రాచీనకాలం నుండే వ్యవసాయ పరిజ్ఞనం ఉందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి.
ఆ కాలంలో అత్యున్నత విలువలతో , సహజమైన , ప్రకృతి వ్యవసాయం అమల్లో ఉండేది. నాటి రైతులు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ , జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ వచ్చారు . పశుపక్షాదులను ప్రేమిస్తూ , పంటలతో పాటు , పాడి , పండ్లు కూరగాయలను పండిస్తూ , ఆహ్లదంగా , ఆనందంగా , ఆరోగ్యాంగా గడిపారు . వృక్ష సంపదను పెంపొందిస్తూ . నెలకు మూడు వానలు ఆస్వాదించారు .
ఈనాడు వ్యవసాయం చేస్తున్న పద్దతుల వలన మానవుడు తన స్వార్ధం కోసం , అరణ్యాలను , వృక్ష సంపదలను కొల్లగొడుతున్నారు.ప్రకృతికి విరుద్దంగా విషపూరిత మైన రసాయనాలతో భూమాతను గాలిని నీటిని వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాడు. జీవవైవిధ్యం లేకుండా విషాహారం పండించి తాను విషం తింటూ సమాజానికి అందిస్తునాడు . చివరికి పెట్టుబడి పెరిగి తానే బలై పోతుననాడు ఆత్మహత్య చేదుకుంటున్నారు.
రైతులారా , ఆలోచించండి. పూర్వ వైభవోపేతమైన , సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయం ఈనాడు చేయలేమా? వృక్ష సంపదను పెంపొందించలేమా? ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుకోలేమా? నెలకు మూడు వానలు కురిపించుకోలేమా? ఆత్మహత్యలు ఆగేలా చేయలేమా? తప్పకుండ చేయగలం.
రండి చెయ్ చెయ్ కలుపుదాం; సేంద్రియ వ్యవసాయం చేద్దాం ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకొందాం ;ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దాం .స్వచ్ఛ భారత్ను నిర్మిద్దాం.
Post a Comment