An article by Mr. Kiran kumar sidam about Methods and Procedures of Organic Farming
సేంద్రియ వ్యవసాయ పద్ధతులు - విధానాలు
వీటిని 5 భాగాలుగా విభజించారు:-
1. నేల ఆరోగ్య పరిరక్షణ2. శత్రు పురుగుల యాజమాన్యం
3. తెగుళ్ల యాజమాన్యం
4. పంట పెరుగుదల - అధిక దిగుబడి
5. జీవ నియంత్రణ పద్ధతులు
సేంద్రియ పద్దతులో ఈ 5 అంశాలు ఎలా సాధ్యమో ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం...
1. నేల ఆరోగ్య పరిరక్షణ:-
- చెరువు మట్టి: ఆవకాశం ఉన్న చోట ఎకరానికి 30-40 ట్రాక్టర్ల చెరువు మట్టి పోయాలి. భూమీ భౌతిక స్థితి మారి, తేమ నిల్వ శక్తి, భూసారం పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది. రసాయన ఎరువులపై పెట్టుబడి తగ్గుతుంది.
- పచ్చి రొట్ట ఎరువు : పచ్చి రొట్ట ఎరువులో పచ్చి రొట్ట , పచ్చి ఆకు అను రెండు రకాలున్నాయి..
పచ్చి రొట్ట అంటే పప్పు జాతికి చెందిన జీలుగా, జనము, పెసర, పిల్లి పెసర, బొబ్బర్లు లాంటి విత్తనాలను పొలంలో చల్లి మొలచిన 30-40 రోజుల్లో పంటను పొలంలో కలియదున్నడం. ఎకరం లో 20 టన్నుల జనము వల్ల 21 టన్నులు, పిల్లి పెసర వల్ల 18 టన్నుల, అలసంద వల్ల 15 టన్నులు, పెసర వల్ల 18 టన్నుల పచ్చిరొట్ట బలం చేకూరుతుంది..
- పచ్చి ఆకు : పచ్చి రొట్ట వేయలేని పరిస్థితులలో కానుగా, గ్లైరిసీడియా, సీమతంగేడు, జిల్లేడు, పాలకోడిశ మొదలగు వాటి పచ్చి ఆకులను పొలంలో వేసి దున్నటం వల్ల నేల సారవంతం అవుతుంది.
పచ్చి రొట్ట కానీ పచ్చు ఆకు కానీ పొలంలో కలియ దున్నాక ఏర్పడిన సేంద్రీయ పదార్ధం లో ఉండే "హ్యూమన్" భూమిలో ఉన్న పోషకాలను పీల్చుకుని పైరుకు అందిస్తుంది . అలాగే వీటిలో ఉండే ఎంజైములు నేలలో లభ్యం కాకుండా ఉన్న జింక్, కాల్షియమ్, మెగ్నీషియం, ఐరన్ మొదలగు పోషకాలను పైరుకు అందిస్తుంది. ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలుగుతుంది.
- డబోల్కర్ పద్దతి : మెట్టభూమితో భూసారం పెంచే పద్ధతి. రైతు తనకున్న మొత్తం విస్తీర్ణంలో ఒకేసారి కాకుండా ప్రతి సంవత్సరం కొంత విస్తీర్ణంలో చేసుకోవాలి. ఒక ఎకరాకు కావలసిన గింజలు ఐదు రకాలు.
1. తృణ ధాన్యాలు -5 కిలోలు(వొడ్లు,గోధుమలు,జొన్నలు,రాగులు మొ)
2. నూనె గింజలు - 5కిలోలు(నువ్వులు,వేరుశనగలు,ప్రొద్దుతిరుగుడు మొ)
3. పప్పు దినుసులు -5కిలోలు (కంది,పెసర,బొబ్బరి, మినుములు మొ)
4. సుగంధ ద్రవ్యాలు -5 కిలోలు (ధనియాలు,ఆవాలు,మెంతులు మొ)
5. పచ్చిరొట్ట - 5 కిలోలు ( పిల్లి పెసర,జనము,జీలుగా మొ)
ఎకరాకు 25 కిలోల గింజలు అలికి 30-40 రోజులు తరువాత భూమిలో కలియదున్నాలి. భూమి సేంద్రీయ పరంగా సారవంతమౌతుంది.
- పశువుల, గొర్రెల మందలు : రైతులకు గొర్రె మందలను తమ పొలంలో పెట్టడం అలవాటు. దీని వల్ల భూమికి ముఖ్యంగా నత్రజనితో పాటు ఇతర పోషకాలు అందుబాటులోకి వస్తాయి . భూసారం పెరుగుతుంది. అవకాశముంటే వడొచ్చు కానీ తప్పనిసరి కాదు.
- సాంప్రదాయ పెంట : గ్రామాల్లో పశువుల కొట్టంలో ని చెత్త చెదరంను పెడను వృధాగా పడేస్తుంటారు. అలా కాకుండా క్రమ పద్ధతి పాటించి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఎత్తయిన ప్రదేశం లో 10×5×3 అడుగుల గుంతను తీసి చెత్త చెదారం పేద మొదలగు వాటితో భూమిని 2-3 అడుగుల ఎత్తు నింపి పైన పేడతో పూత పూసిన 3 నెలల్లో మంచి ఎరువు తయారవుతుంది. పంటలకు వాడిన చో భూసారం పెరిగి దిగుబడి పెరుగుతుంది. ఇది అదనపు చర్య మాత్రమే అవకాశముంటే వాడవచ్చు.
Post a Comment