An article by Mr. Kiran kumar sidam about importance of Gomatha
గోవు ప్రాముఖ్యత
శ్లోకం: నమో గోభ్యశ్రీమతిభ్య: సౌరభేయిభ్యా ఏవచ నమోబ్రహ్మను సుతాభ్యశ్చ పవిత్రేభ్యా నమోనమ:
* ఈ శ్లోకాన్ని చదివి శ్రీ సురభై నమ: అనే మంత్రాన్ని వీలైనన్ని మార్లు జపించి గోవును నమస్కరిస్తే సకల సంపదలు , ఆయురారోగ్యాలు వృద్ధి అవుతాయన్నది శాస్త్ర వచనం.
* గోమూత్రంతో వైద్యం చేయడం అంటే అదొక కాలం చెల్లిన చికిత్స అని చాదస్తపు వైద్యమని అలోపతి వైద్యులు చులకనగా చూస్తారు . గోమూత్రంలో ఎన్నో ఓషధి గుణాలు ఉన్నాయంటే కొందరు డాక్టర్ లు నేటికీ విశ్వశించడం లేదు.
* డాక్టర్ సత్యసంకర్ వార్ముడి కేరళ ప్రాంతానికి చెందిన అలోపతి వైద్యుడు. ఆయన సుఖ వ్యాధులకు చికిత్స చేసే బాధ్యతతో తనకు తెలిసిన అలోపతి వైద్యం చేస్తుండేవాడు. ఆంగ్ల భాషలో అలాంయి వైద్యులను 'ఓరల్ సర్జన్' అని అంటారు. ఎవరికీ చిక్కని అంతు పట్టని కాన్సర్ వ్యాధికి ఇలాంటి సామాన్య వైద్యుడు చికిసత్స చేయగలడా ? ఆ చికిత్స వలన రోగం నయం అవుతుందా? అనే అనుమానం కలగడం వింత కాదు. అతని దగ్గరకు ఒక పేద వృద్దురాలు నోటిలో కాన్సర్ తో బాధపడుతూ వచ్చింది. డాక్టర్ వార్ముడి తనకు తెలిసిన అలోపతి వైద్యం చేయడం మొదలెట్టాడు. అతనికి తన గురువు గారి పట్ల అచంచలమైన భక్తి . గురువు గారు ఏది చెప్పిన దాని ఆజ్ఞగా భావించి అతని మాటను పాటించడమే గాని ప్రశ్నించేవాడు కాదు. ఆయుర్వేద వైద్యులు విశేషంగా అభిమానించే గోమూత్ర అర్కుతో చికిత్స చేయమని గురువు గారు శిష్యునికి సలహా ఇచ్చారు. ఇతను చూడబోతే అలోపతి వైద్యుడు. తోటి డాక్టర్ లతో తన సమష్యను చర్చించారు. ఈ విషయమై మనమెందుకు పరిశోధనలు చేయాలి ఆ పరిశోధనాలేవో ఆయుర్వేద వైద్యులకే వదిలేస్తే సరిపోతుంది అన్నారు వారు. ఒక వంక గురువు గారి ఆజ్ఞ , వేరొక వంక వీరి సలహా! ఏమైతేనేం అతను గురువు గారి ఆజ్ఞ మీరగలడా? అతను ఏ మాత్రము వీచలితుడు కాలేదు. గురువు గారి మీద నమ్మకం ఉంది. దేశి గోవు మూత్రంతో తయారుచేసిన కామధేను అర్కును వ్యాధి గ్రస్తులకు ఇస్తూ వైద్యం చేయగలిగాడు. క్రమ క్రమంగా ఆమె పరిస్థితి మెరుగైంది. వ్యాధి తగ్గు మొఖం పట్టింది. భాధలు తగ్గాయి. ఆ తరువాత కొంత కాలానికి ఆ వ్యాధి సంపూర్నంగా తగ్గిపోయింది. డాక్టర్ సత్య శంకర్ ఆనందించాడు. ఈ విషయం తెలుసుకున్న వాలు ఆశ్చర్యపోయారు. నోటా మాట రాక అవాక్కయ్యారు. తన సఫల పరీక్షణతో అతను సంతృప్తి పడలేదు. డాక్టర్ సత్య శంకర్ వార్ముడి గారు తన పరిశోధన గురించి వైద్య జగత్తులో ప్రచారం చేయాలి అనుకున్నాడు. మహారాష్ట్ర లోని జలగావ్ వంటి ప్రదేశాలలో తన పరిశోధన ఫలితాలను వివరించి చెప్పాడు.
* అతని పరిశోధనకు ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రతిస్పందన వచ్చింది. తిరుమ తిరుపతి దేవస్థానం వారు 2008 లో ఒక సదస్సును నిర్వహించారు. ఆ సభలో 'The Glory Of Gomatha' ను ప్రదర్శించారు. డాక్టర్ గారిని సత్కరించారు.
* ఆ సమావేశానికి దేశం నాలుగు చెరగులా నుండి 3 వేలకు పైగా విభిన్న చికిత్స విధానాలకు సంబంధించిన వైద్యులు విచ్చేసారు. వీరి పరిశోధన ఎందరికో స్ఫూర్తిదాయకం. నీదు అర్కుతో కాన్సర్ వ్యాధి చికిత్స చేస్తున్నారు. ఆయుర్వేదం అతి ప్రాచీనమైన వైద్యం. ఏ దేశం లోను నాగరికత అభివృద్ధి చెందని కాలం లో మన ఋషులు వారి తపసు శక్తితో మనకు ప్రసాదించింది ఆయుర్వేదం. ఈ శాస్త్ర సంపదను కాపాడుకోవలసిన భాద్యత మనది. గోవు భారతీయులకు తల్లితో సమానం. అందువలన అది పూజ్యమైనది. దానిని కాపాడుకోవలసిన భాద్యత కూడా మన మీదే ఉంది.
Post a Comment